భారత్‌ గ్లోబల్‌ లీడర్‌: జీ20 లీడర్‌షిప్‌ అదుర్స్‌?

Chakravarthi Kalyan
ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ మరియు అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహా సాంగ్ ఆధ్వర్యంలో.. ఇండియాస్ జీ 20 ప్రెసిడెన్సీ అనే అంశంపై వర్సిటీలో నిర్వహించే జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్స్ లర్ డాక్టర్ తమిళ సై సౌందర రాజన్ హాజరైన ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో కీనోట్ స్పీకర్ గా అఖిల భారతీయ రాష్ట్రీయ శై క్షిక్ మహా సంగ్ నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గుంత లక్ష్మణ్ హాజరై ప్రసంగిస్తారు. ఈ సదస్సు దేశాన్ని ఆత్మనిర్బార్ భారత్ గా అభివృద్ధి పరచడంలో, గ్లోబల్ డిజిటల్ లీడర్ గా ఎదగడంలో, ప్రపంచానికి చిరుధాన్యాలు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

నూతన విద్యావ్యవస్థ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ఐటీ హబ్ బయోసైన్స్  హ బుగా భారతదేశం ఎదుగుతున్న సందర్భంలో జీ 20 లో నాయకత్వం వహిస్తున్న సందర్భంలో ఎదురయ్యే సవాళ్లు  పై చర్చ జరుగుతుందని, వసుదైవ కుటుంబం అనే లక్ష్యంతో సదస్సు ముందుకు సాగుతుందని ఈ సెమినార్ డైరెక్టర్ డాక్టర్ ఎం సత్యనారాయణ చెబుతున్నారు. ఈ సమావేశంలో చీప్ ప్యాటర్న్ గా వైస్ చాన్స్ లర్ రవీందర్, ప్యాటర్నుగా  రిజిస్టార్  ప్రొఫెసర్ విద్యావర్ధిని,
కో ప్యాటర్న్ గా ప్రిన్సిపాల్ ఆరతి లు వ్యవహరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: