హిట్ టాక్ వస్తే అక్కడ మన శంకర వరప్రసాద్ గారు మూవీని ఆపడం కష్టమే..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించాడు. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సాహు గారపాటి , సుస్మిత కొణిదల సంయుక్తంగా నిర్మించారు . ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన అన్ని ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాయి. దానితో ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అద్భుతమైన రీతిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
 


ఈ మూవీ కి సంబంధించిన యుఎస్ఏ ప్రీమియర్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యే చాలా రోజులు అవుతుంది. ఈ సినిమా యూఎస్ఏ బుకింగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ జనాలను లభిస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఇప్పటివరకు ఈ సినిమాకు యూఎస్ఏ ప్రీమియర్స్ ఫ్రీ సెల్ ద్వారా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు యూఎస్ఏ లో ప్రీమియర్ ప్రీ సేల్స్ ద్వారా 500 కే ప్లస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇంకా ఈ మూవీ విడుదలకు సమయం ఉంది. ఒక వేళ ఈ మూవీ కి మంచి టాక్ గనుక వస్తే ఈ మూవీ యూఎస్ఏ లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: