Kgf 3 పై క్లారిటీ ఇచ్చేసిన యష్.. సలార్ - కేజిఎఫ్ లింక్..?
హీరో యష్ ఒక ఇంటర్వ్యూలో కేజిఎఫ్ 3 పై పలు వ్యాఖ్యలు చేశారు. కేజిఎఫ్ 3 సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తామని ప్రామిస్ చేస్తున్నానని తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రేక్షకులే అంటూ తెలిపారు. ప్రేక్షకులకు సరైన సమయంలోనే కేజిఎఫ్ 3 చిత్రాన్ని మాస్ ప్రేక్షకులు గర్వపడేలా తీసుకువస్తామని తెలియజేశారు. కేజిఎఫ్ సిరీస్లు అంటే కేవలం సినిమా కాదు. ఒక పండుగ అని మాట్లాడారు. అలాగే ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు కేజిఎఫ్ సినిమాకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే విషయంపై యాంకర్ ప్రశ్నించగా?
అలాంటిదేమీ లేదు కేవలం సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ మాత్రమే అవి అంటూ చెక్ పెట్టారు. ప్రస్తుతం తన ముందు రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పైనే మొత్తం దృష్టి పెట్టాను ( టాక్సిక్, రామాయణం) తర్వాతే కేజిఎఫ్ 3 గురించి సరైన అప్డేట్ ఇస్తామని తెలియజేశారు. మొత్తానికి అభిమానులకు సైతం కేజిఎఫ్ 3 పై మాట్లాడడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇటీవలే యష్ నటించిన టాక్సిక్ సినిమా ట్రైలర్ జనవరి 8వ తేదీన రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఊహించిన దాని కంటే ఎక్కువగానే సర్ప్రైజ్ అయ్యారు. ప్రస్తుతం యూట్యూబ్లో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది ట్రైలర్.హీరో యష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.