"ఆడాళ్లు మీకు జోహార్లు" సినిమా ఓ స్టార్ హీరో చేయాల్సింది.. ఎలా మిస్ అయిందో తెలుసా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ యవ నటుడు శర్వానంద్ "ఆడాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. ఇకపోతే తాజాగా కిషోర్ తిరుమల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా కథను మొదట ఎవరికి చెప్పింది ..? ఎందుకు ఆ హీరో ఆ సినిమా చేయలేదు అనే విషయాలను క్లియర్ గా చెప్పుకొచ్చాడు.


తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కిషోర్ తిరుమల మాట్లాడుతూ ... ఆడళ్ళు మీకు జోహార్లు సినిమా కథను మొదట వెంకటేష్ గారికి వినిపించాను. ఆయనకు సినిమా కథ బాగా నచ్చింది. కానీ అప్పటికే అలాంటి జోనర్ సినిమాలు వరుసగా చేస్తూ ఉన్నాను అని , మళ్ళీ ఇప్పుడు అలాంటి సినిమానే చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో ..?  లేదో ..? అలాగే నాకు కూడా అలాంటి సినిమాల్లో నటించి బోర్ కొట్టింది. కాస్త కొత్త దనం ఉన్న సినిమాల్లో నటించాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. అలా ఆడాళ్లు  మీకు జోహార్లు సినిమా కథను మొదట వెంకటేష్ గారికి వినిపించాను అని కిషోర్ తిరుమల తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా కిషోర్ తిరుమల , రవితేజ హీరోగా డింపుల్ హయాతి , ఆశిక రంగనాథ్ హీరోయిన్లుగా రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు  ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: