చేనేతన్నలకు అవార్డులు.. ఇలా అప్లయ్‌ చేసుకోండి?

Chakravarthi Kalyan
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేయబోతోంది. దీని కోసం చేనేత కళాకారుల నుండి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసుకునే చేనేత కళాకారునికి గత సంవత్సరం డిశంబర్ 31 తేది నాటికి 30 సంవత్సరాలు నిండాలి. అలాగే అతనికి 10 సంవత్సరాల అనుభవం ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే  చేనేత డిజైనర్లు 31. 12. 2022 నాటికి 25 సం,, వయసు నిండి ఉండాలి. అలాగే  5సం, అనుభవం ఉండాలని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తమ దరఖాస్తులను 15. 04. 2023 లోగా ఆయా జిల్లా చేనేత &జౌళి సహాయ సంచాలకులకు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మిగతా వివరాలకు www.handtex.telangana.gov.in ను సంప్రదించగలరని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం నేతన్నలూ దరఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: