శభాష్‌ మోదీ.. సరిహద్దు గ్రామాలకు గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
మోదీ సర్కారు సరిహద్దు గ్రామాల కోసం ఓ చక్కటి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం కింద ఉత్తర సరిహద్దుల్లోని గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ఓ కార్యక్రమం రూపకల్పన చేసింది. వైబ్రంట్‌ విలేజస్ ప్రోగామ్‌ అమలు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 2022-23 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య 4 వేల 800 కోట్ల రూపాయలతో ఈ పథకం అమలు చేస్తారు.
ఈ పథకం ద్వారా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని సరిహద్దు గ్రామాలకు లబ్ది చేకూరుతుంది. ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయలతో పాటు జీవనోపాధి అవకాశాలు పెంచడమే ఈ పథకం ఉద్దేశమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెబుతున్నారు. అలాగే చైనాతో ఉన్న వాస్తవాధీనరేఖ వెంబడి సైన్యం బలోపేతం కోసం మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇండో-టిబెటన్‌ బోర్డర్ పోలీస్‌కి  కొత్తగా మరో ఏడు బెటాలియన్లు
మంజూరు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: