యువతితో పెళ్లికి దొంగ బాబా కుట్ర.. దొరికిపోయాడు?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహం చేసుకుంటానని దొంగ బాబా హఫీజ్ పాషా బాగోతం బయటపడింది. పెళ్లి సమయానికి రాకపోవడంతో పెళ్లికూతురు తరపు వారు హఫీజ్ పాషా బంధువులను విచారించగా అసలు విషయం తెలిసింది. తన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని చెప్పడంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు. దొంగ బాబా గతంలోనే అనేక పెళ్లిళ్లును చేసుకోన్నారని పెళ్లికూతురు తరపు బంధువులకు తెలిపారు.

నెల్లూరు లోని వివిధ ఠాణాలో అతనిపై దాదాపు 13 కేసులు ఉన్నాయి. ఇతని గురించి వివరాలు సేకరిస్తే విషయాలు వెలుగులోకి వచ్చాయని పెళ్లికూతురు తరపు బంధువులు తెలిపారు. ప్రస్తుతం పోలిసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికూతురుకి కొద్ది రోజులు క్రితం అనార్యోగం ఉండంతో నెల్లూర్ దర్గాకి తీసుకవెళ్లామని దర్గాలోఉండే హఫీజ్ పాషా బాబా మీ అమ్మాయి కోన్ని రోజుల తరువాత చనిపోతుందిని చెప్పాడని.. మళ్లి అతనే మీ అమ్మాయి పెళ్లి చేసుకోని అమె ప్రాణాలు కాపాడుకోంటాని అంటే మేము పెళ్లికి సిద్దం చేశామని పెళ్లికూతురు బంధువులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: