కేసీఆర్ గారూ.. మా కులాలను ఆదుకోరా?

Chakravarthi Kalyan
కార్పొరేట్ ప్రభావంతో చేతి వృత్తులు కోల్పోయిన విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలను  కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బడ్జెట్ లో తమ జాతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని... దీనివలన రాష్ట్రంలోని కుల వృత్తులపై ఆధారపడిన తాము నిరాశకు గురైన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

గత బడ్జెట్ అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టిన 250 కోట్ల నిధులు ఇప్పటివరకు విడుదల చేయకుండా ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం నేతలు మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణ, విశ్వ కర్మ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సంక్షేమం కోసం నిధులు విడుదల చేసి... తమ వృత్తులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం నేతలు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: