తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై కీలక నిర్ణయాలు?

Chakravarthi Kalyan
తెలంగాణ బడ్జెట్, పద్దులపై చర్చ, ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ అనంతరం అవసరమైతే మిగిలిన అంశాలపై చర్చ చేపట్టాలని తెలంగాణ శాసనసభా వ్యవహారాల సలహా సంఘం నిర్ణయించింది. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఉప సభాపతి పద్మారావు, మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నందున బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని భట్టి విక్రమార్క కోరారు. కనీసం 25 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భట్టి విక్రమార్క  అన్నారు. బడ్జెట్ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలన్న  మజ్లిస్ సమావేశాల్లో చర్చించేందుకు 25 అంశాలను ప్రతిపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: