బడ్జెట్‌: తెలంగాణకు దక్కిందేంటి?

Chakravarthi Kalyan
కేంద్ర బడ్జెట్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది రైతులను, పేదలను దగా చేసి అదానీ, అంబానీలను ఆదుకునే బడ్జెట్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనుకోవడం సిగ్గు చేటని.. మోడీ ప్రభుత్వ చివరి బడ్జెట్ లో కూడా పసుపుబోర్డుకు మొండిచేయి చూపిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక అప్పర్ భద్రకు ఇచ్చారు సరే..  కానీ.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం,పాలమూరు-రంగారెడ్డిసాగునీటి ప్రాజెక్టులు ఎందుకు మరిచారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ జాతీయ రహదారులకు ఇప్పటి వరకు లక్ష 25 వేల కోట్లు కేటాయించి ఎనిమిది ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 18వేల కోట్లేనన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. మెడికల్ కాలేజీలేవీ, నర్సింగ్ కాలేజీలేవీ,నవోదయ స్కూల్స్ ఏవి,రైల్వే లైన్లు ఏవి అని ప్రశ్నించారు. తెలంగాణకు వచ్చి మోడీ అండ్ కో బ్యాచ్ ప్రసంగాల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్ప... చేతల్లో ఒరిగింది శూన్యమని.. ఈ బడ్జెట్ తో తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరి మరోసారి తేటతెల్లం అయ్యిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: