తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన నాబార్డ్‌ సంస్థ?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నాబార్డు సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు చెల్లింపుల కోసం నాబార్డు సంస్థ పౌరసరఫరాల సంస్థ 3 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చింది. 2022 వానా కాలం సీజన్‌లో పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంకి సంబంధించి చెల్లింపులు చేయడానికి నాబార్డ్ ఈ రుణం తీసుకున్నామని పౌర సరఫరాల సంస్థ తెలిపింది. పౌరసరఫరాల సంస్థ బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రుణ సేకరణ నిమిత్తం నిర్వహించిన టెండర్లో నాబార్డ్ సింగిల్ టెండర్ వేసింది. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రుణపరిమితి నిబంధనలకు అనుగుణంగా నాబార్డు నుంచి రుణ సేకరణ జరిపింది. వానా కాలం మార్కెటింగ్ సీజన్‌లో పౌరసరఫరాల సంస్థ 9.65 లక్షల మంది రైతుల వద్ద నుంచి 13,189 కోట్ల రూపాయల విలువ చేసే 64.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పుడు తీసుకున్న 3 వేల కోట్ల రూపాయల్లో 500 కోట్ల రూపాయల వరకు రైతులకు చెల్లింపులు చేస్తారు. మిగిలిన మొత్తం గతంలో తీసుకున్న స్వల్పకాలిక రుణాలు తిరిగి చెల్లించడానికి ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: