వికలాంగులకు వరం జైపూర్‌ ఫుట్‌?

Chakravarthi Kalyan
ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయి వికలాంగులుగా మారిన వారికి జైపూర్ ఫుట్ ఎంతో అండగా నిలుస్తోంది. అలాంటి వారికి చేయూతనిచ్చేందుకు అమెరికాలోని జైపూర్ ఫుట్ యూఎస్ సంస్థ ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు వెయ్యి మందికిపైగా వికలాంగులకు ఉచితంగా జైపూర్ ఫూట్, లింబ్స్ అందించబోతోంది. హైటెక్ సిటీలోని పీపుల్ టెక్ సంస్థ అధినేత విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్, జైపూర్ ఫూట్ యూఎస్ఏ, భగవత్ మహవీర్ వికలాంగ సహాయ సమితి, జైపూర్ ఇండియా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్స్ టెక్, ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ సంస్థలు ఇటీవల  జైపూర్ ఫుట్ క్యాంపును నిర్వహించారు.

ఈ క్యాంపును కేంద్ర సామాజిక శాఖ మంత్రి రాందాస్ అత్వాల లాంఛనంగా ప్రారంభించారు. జైపూర్ యూఎస్ వ్యవస్థాపకులు ప్రేమ్ బండారీతోపాటు ప్రముఖ వ్యాఖ్యాత, ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ సంస్థ వ్యవస్థాపకురాలు సుమ కనకాల అతిథులుగా హాజరయ్యారు. దేశంలో సుమారు 2 కోట్ల మంది దివ్యాంగులున్నారు. వారందరికి ప్రభుత్వంతోపాటు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు సహాయ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: