కర్ణాటకలో బయటపడిన ఉగ్రవాద ముఠాలు?

Chakravarthi Kalyan
కర్ణాటక రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాల్లో ఐ ఎస్ ఐ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. జనవరి 5, 2023 న ఎన్ఐఏ ఆరు వివిధ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించింది. దక్షిణ కన్నడ, బెంగళూరు, శివమొగ్గ, దావణగిరి తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో దొరికిన సమాచారంతో  ఇద్దరిని అరెస్టు చేసింది. ఎన్ఐఏ అరెస్టు చేసిన దాంట్లో ఒకరు రేషన్ తాజోద్దీన్ షేక్ ఉడిపి జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, రెండో వ్యక్తి శివమొగ్గ జిల్లాకు చెందిన ఉజాయిర్ పర్హాన్ బైగ్.

ఇందులో సంచలన విషయం ఏమిటంటే ఈ రేషన్ తాజోద్దీన్ షేక్, కాంగ్రెస్ అగ్ర నేత అయిన తాజోద్దీన్ షేక్ కుమారుడు అని తేలింది. ఎన్ఐఏ సమాచారం ప్రకారం.. రేషన్ తాజోద్దీన్ తన కాలేజీ స్నేహితుడైనా మునీర్ ద్వారా ఈ ఐఎస్ఐ భావజాలానికి లోనయ్యాడని తెలుస్తోంది. మునీర్ ని 2022 సెప్టెంబర్ లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. దొరికిన ఇద్దరి ఉగ్రవాదులకు క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులందుతున్నాయని, వీరి ప్లాన్ ఎంటంటేఇళ్లు తగలబెట్టడం, దోచుకోవడం, లిక్కర్ షాపులు లూటీ చేయడం, తదితర పనులు చేయడం ద్వారా దేశంలో అశాంతిని రేకేత్తించడంగా తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: