ఉక్రెయిన్‌పై కొత్త ఆయుధం బయటకు తీసిన రష్యా?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్న అమెరికా ఇంకా యూరప్ దేశాలకు రష్యా దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయో తెలుసు, అంతేకాకుండా వాటికి బదులుగా వారు ఏ ఆయుధాలు వాడాలో కూడా తెలుసు. కానీ కొత్తగా వచ్చిన ఈ యుద్ధ పరికరాలు గురించి తెలియక తల్లడిల్లి పోయింది ఉక్రెయిన్. ఇప్పుడు వరకూ ఇరాన్ దగ్గర నుంచి తీసుకొచ్చిన డ్రోన్లు, మిస్సైల్స్, నార్త్ కొరియా నుంచి తీసుకొచ్చిన మిస్సైల్స్,వీటి గురించి ప్రపంచానికి తెలియదు. కాబట్టి   వాటితో ఎటాక్ చేసేసరికి ఉక్రెయిన్ తల్లడిల్లిపోయింది.

 హేమస్ అమెరికాకు సంబంధించిన  మిస్సైల్స్ తో అటాక్ చేస్తే ఎంతమంది చనిపోయారు అన్న విషయం పక్కన పెడితే ఆ సందర్భాల్లో ఉక్రెయిన్ ను చావు దెబ్బ కొట్టింది రష్యా. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ కు చెమటలు పట్టించేలా మళ్లీ కొత్త మిస్సైల్ వాడబోతుంది. అది కూడా ఇప్పటివరకు వాడని జిర్కాన్ హైపర్ సోనిక్ మిస్సైల్స్ ని వాడబోతుంది.  

అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఇంకా  మధ్యధరా సముద్రాల్లో వీటిని టెస్ట్ చేసి ఆర్మీలో వాడబోతున్నట్టుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించినట్టుగా తెలుస్తుంది‌. వీటిని ఉక్రెయిన్ అమెరికా సహాయంతో రష్యాపై దాడి చేసి 84 మందిని చంపిన సంఘటన తర్వాత అభివృద్ధి చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పై త్రివిధ దళాలతో దాడి చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: