వివాదం: కల్లుకు వేదామృతమని పేరు పెడతారా?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీరా కేఫ్ కొత్త వివాదానికి దారి తీస్తోంది. ప్రత్యేకించి ఇక్కడి నీరాకు పెట్టిన పేరు వివాదానికి కారణమైంది. నీరా స్టాల్ కి వేదామృతం అనే పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు బ్రాహ్మణ సంఘాలు నీరా కేఫ్ ముందు ఆందోళనకు దిగుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న గౌడ కులస్తులు కూడా నెక్లెస్ రోడ్డు చేరుకొని బ్రాహ్మణ సంఘాల నాయకులతో వాగ్వాదం చేశారు.

ఈ వాగ్వాదంతో అక్కడ కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వేదం అనే పదాన్ని తీసివేయలని బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే..  స్వచ్ఛమైన ప్రకృతి పానీయం నీరాకు వేదామృతం పేరు పెడితే వేదాలను కించపరిచినట్లు ఎలా అవుతుందని గౌడ సంఘాలు ప్రశ్నించాయి.  పురాణలలో సురులు సేవించిన పానీయాన్నీ సురాపాకం అన్నారని గౌడలు గుర్తు చేస్తున్నారు. వేదాలను రాసింది కూడా తాటి కమ్మల మీదనే అని బ్రాహ్మణులు గ్రహించాలంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: