సంక్రాంతి ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్‌?

Chakravarthi Kalyan
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే సమయంలో టోల్ ప్లాజాల దగ్గర రద్దీ చిరాకు పెడుతుంది. అయితే.. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్‌ ఆర్టీసీ ఆలోచన చేసింది. టోల్‌ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు సులువుగా వెళ్లేలా టీఎస్‌ ఆర్టీసీ చర్యలు తీసుకుంది. టీఎస్‌ ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌లను కేటాయించాలని కోరుతూ నేషనల్‌  హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, తెలంగాణ ఆర్‌ అండ్‌ బీ విభాగాలకు టీఎస్‌ ఆర్టీసీ లేఖలు రాసింది.

అంతే కాదు.. ఈ మేరకు టోల్‌ ప్లాజా నిర్వాహకులనూ  టీఎస్‌ ఆర్టీసీ సంప్రదించింది. దీంతో టీఎస్‌ ఆర్టీసీ విజ్ఞప్తి మేరకు ఈ నెల 10 నుంచి 14 తేదీ  వరకు టీఎస్‌ ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయిస్తామని నేషనల్‌  హైవేస్‌ అథారిటీ హామి ఇచ్చింది. ఆయా టోల్‌ ప్లాజాల వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది మూడు షిప్ట్‌ల్లో 24 గంటలపాటు విధులు నిర్వహించేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: