కేసీఆర్‌ ప్రయోగం.. పెద్ద ప్రమాదకరంగా మారిందా?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వ్యవస్థ రెవెన్యూ విధానానికి అతి పెద్ద ప్రమాదకరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంటున్నారు. ధరణితో పేదలు మధ్య తరగతి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  తెలిపారు. ధరణిని రద్దు చేయాలని అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  పేర్కొన్నారు. పాలకులు ప్రభుత్వ వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుని గొప్పవారిగా ప్రచారం చేసుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.

భారత్‌ జోడో యాత్ర ముగింపును కొనసాగిస్తూ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దేశవ్యాప్తంగా చేపడుతున్న హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్ యాత్రను విజయవంతం చేద్దామని భట్టి విక్రమార్క  పిలుపునిచ్చారు. అనేక మతాలు ఈ దేశంలో సహజీవనం సాగించాలన్న బాపూజీ ఆశయాలను బీజేపీ తుంగలో తొక్కిందని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: