విజయవాడ, కాకినాడ వాసులకు ఆర్టీసీ గుడ్ న్యూస్?
ఈ స్లీపర్ బస్సుల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్లీపర్ బస్సుల్లో లోయర్ బెర్తులు 15, అప్పర్ బెర్తులు 15 వరకు ఉంటాయి. ప్రతి బెర్త్ వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బస్సుకు ఎయిర్ సస్పెన్షన్ సదుపాయం ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సులోనూ వైఫై సదుపాయాన్ని కల్పించారు. లగేజీ లోడింగ్, అన్లోడింగ్కు అటెండెంట్లు సహకరిస్తారు. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి.