అమెరికాను వణికిస్తున్న వేరియంట్‌.. ఇప్పుడు ఇండియాలోనూ?

Chakravarthi Kalyan
అమెరికాలో వ్యాపిస్తోన్న కరోనా కేసుల్లో 40శాతం కేసులు ఒమిక్రాన్ XBB 1.5 వేరియంట్ కి  చెందినవేనని తేలింది. ఈ విషయాన్ని మిన్నేసోటా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ అంటువ్యాధి నిపుణుడు డాక్టర్ మైఖేల్ ఓస్టర్ చెబుతున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత దుర్బర వేరియంట్ ఇదేనని  మైఖేల్ ఓస్టర్ అన్నారు. న్యూయార్క్ లో  చాలామంది ఆస్పత్రిలో చేరడానికి కారణమైన వేరియంట్ గా దీన్ని  మైఖేల్ ఓస్టర్ పేర్కొన్నారు. ఇది వ్యక్తిలోని రోగ నిరోధక శక్తిని క్షీణింపజేస్తుందని డాక్టర్ మైఖేల్ ఓస్టర్ తెలిపారు. గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని  మైఖేల్ ఓస్టర్ తెలిపారు.
అమెరికాలో ఈ XBB 1.5 వ్యాప్తి అధికంగా ఉందని..  డాక్టర్ మైఖేల్ ఓస్టర్ తెలిపారు. BQ1 వేరియంట్ కంటే  XBB 1.5 120శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని  మైఖేల్ ఓస్టర్ చెప్పారు. అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసులు నమోదవ్వడానికి ఇదే కారణమట. అమెరికాతోపాటు యూకేలోనూ ఒమిక్రాన్ XBB 1.5 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వేరియంట్‌ కేసు ఒకటి తాజాగా గుజరాత్‌లో వెలుగు చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: