ఆ విషయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ అట్టర్‌ ఫ్లాప్‌?

Chakravarthi Kalyan
తెలంగాణకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ.. ఈ డిమాండ్ ఇప్పటిది కాదు.. కొన్ని దశాబ్దాల నుంచి ఈ డిమాండ్ ఉంది. కానీ ఇది నెరవేరడం లేనేలేదు. తాజాగా మరోసారి మరో రాష్ట్రానికి కోచ్‌ ఫ్యాక్టరీ ఆఫర్‌ వెళ్లిపోయింది. తెలంగాణకు కేంద్రం మరోసారి అన్యాయం చేసిందని...దీనిక్కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో కేంద్రం కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదన లేదని చెప్పడం రాష్ట్రానికి ద్రోహం చేయడమేనని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ప్రతిపాదన తెలంగాణ హక్కుగా ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి గుర్తు చేశారు.  రాష్ట్ర హక్కులను కాపాడడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందని...తెలంగాణ హక్కులు సాధించేందుకు కృషి చేస్తోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి స్పష్టం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ సాధనలో విఫలమైన బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు తగిన గుణపాఠం మల్లు రవి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: