కేటీఆర్‌కు.. ఆ మాత్రం తేడా తెలియదా?

Chakravarthi Kalyan
బీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు రైతులు, రైతు కూలీలకు తేడా తెలియదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు కేటీఆర్ చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, అధికార ప్రతినిధులు సంగప్ప, కిషోర్‌ మీడియా సమావేశంలో కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కల్లాలు నిర్మిస్తున్నామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని ప్రకాష్ రెడ్డి తెలిపారు. రైతు దినోత్సవం రోజున నిరసన కార్యక్రమాలు చేపట్టడం పట్ల ప్రకాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు అబద్దాలు మీద అబద్దాలు చెబుతున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలు మరుగుదోడ్లు లేని విషయంలో టాప్‌లో ఉందని బీజేపీ నేత సంగప్ప దుయ్యబట్టారు. అన్ని నియోజకవర్గాల్లో విద్యాలయాలను కట్టించిన తర్వాత కేటీఆర్ సోషల్ మీడియాలో గప్పాలు కొట్టుకోవాలని సంగప్ప విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: