సంక్రాంతికి సొంత ఊరు వెళ్తున్నారా.. గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 6 నుంచి 18 వ తేదీ వరకు పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్టాలకూ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది.. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ  ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి  అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లోనూ ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పింస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీ వెబ్ సైట్ , టికెట్ బుకింగ్ కేంద్రాల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా ఆర్టీసీ కల్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: