జనం అంటే.. జగన్‌కు ఎందుకు అంత భయం?

Chakravarthi Kalyan
జగన్మోహన్‌రెడ్డి పరిపాలన చేతకాక నిధులు వృధా చేస్తున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జనంలోకి కొచ్చి మాట్లాడడానికి జగన్మోహన్‌రెడ్డి భయపడుతున్నారన్న జనసేన పీఏసీ ఛైర్మన్‌... రాజకీయ లబ్ధి కోసమే పవన్‌కల్యాణ్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం, ఓట్లు కోసం పనిచేసే వ్యక్తి పవన్‌ కల్యాణ్ కాదని... జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

పవన్‌ కల్యాణ్ సమాజం కోసమే పని చేస్తారన్న జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్..   శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం మత్స్యకార గ్రామంలో పర్యటించారు.  మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ అన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తే మత్స్యకారుల కష్టాలు తెలుస్తాయన్న నాదెండ్ల... డి.మత్స్యలేశం గ్రామంలో 6 వేల మంది వలస పోవడం దారుణమన్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు అందక గుజరాత్ వలస పోతున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: