కేసీఆర్‌ చెప్పిన ఆ డైలాగ్‌ అదిరింది?

Chakravarthi Kalyan
టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చిన సందర్భంగా కేసీఆర్‌ కొన్ని ఆలోచింపజేసే మాటలు చెప్పారు. చైనా జీడీపీ 1980 వరకు మన దేశం కన్నా తక్కువగా ఉండేదని... ఇప్పుడు 16 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని గుర్తు చేశారు. దక్షిణ కొరియా, జపాన్, మలేసియా వంటి దేశాల్లో అద్భుతాలు జరిగాయని కేసీఆర్ చెప్పారు.  వనరులున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేక పోవడం శోచనీయమని.. ఆ పద్ధతిని మార్చాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ మాదిరిగా దేశాన్ని కూడా బాగు చేసుకోవాలని కేసీఆర్ అన్నారు. సారవంతమైన సాగు భూమి, పుష్కలంగా నీరు, కష్టపడి పనిచేసే ప్రజలు ఉన్న మన దేశం..  ప్రపంచానికే అన్నం పెట్టాలి కానీ.. అది వదిలి మనమే పిజ్జాలు, బర్గర్లు తినడం అంటే అవమానకరమని కేసీఆర్ అన్నారు. దేశంలోని వనరులన్నీ వాడితే అమెరికా కంటే గొప్పగా అభివృద్ధి చెందుతామని కేసీఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: