ఎంతో.. ఎంతో.. ఆలోచించే అడుగేశా: కేసీఆర్‌

Chakravarthi Kalyan
దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. జాతీయ పార్టీ ఏర్పాటు ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదంటున్నారు. బలమైన పునాదులపై తీసుకున్నామని కేసీఆర్ చెబుతున్నారు. ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం జలదృశ్యంలో ప్రారంభమైందని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతోందని పక్క రాష్ట్రాల వారు ఆశ్చర్య పడుతున్నారన్న కేసీఆర్.. యజ్ఞంలా చేస్తున్నందుకే ఇదంతా సాధ్యమైందన్నారు. దేశాన్ని 75 ఏళ్లుగా ఏలిన పార్టీలు.. గద్దెనెక్కడం, దిగడం తప్ప చేసిందేమీ లేదని కేసీఆర్ అన్నారు. ఇతర పార్టీలకు రాజకీయాలపై ఒక ఆటవంటివని.. కానీ తమకు ఒక టాస్క్ అని సీఎం కేసీఆర్ వివరించారు. కేంద్ర అసంబద్ధ విధానాల వల్ల ఇంకా తెలంగాణ పూర్తి స్థాయి విజయాలను అందుకోలేక పోతున్నదని కేసీఆర్ అన్నారు.  తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడినట్లే.. దేశం కోసం కూడా పని చేసి సాధించి చూపెడదామని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: