శభాష్‌ అస్సాం.. కోర్టులపై ఓ మంచి నిర్ణయం?

Chakravarthi Kalyan
కోర్టుల్లో కేసులు పేరుకుపోతోన్నాయి. పెండింగ్‌ కేసులు న్యాయవ్యవస్థకు గుదిబండగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో  పెండింగ్ కేసుల విషయంలో అస్సాంప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించడం కోసం సుమారు 3లక్షల పెట్టీ క్రైమ్‌ కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన అస్సాం కేబినెట్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. న్యాయ స్థానాలపై కేసుల భారాన్ని తగ్గించడంతోపాటు జైళ్ల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గించుకోవడంలో భాగంగానే అస్సాం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అస్సాంలో సుమారు 4.19 లక్షల పెట్టీ క్రైం కేసులు ఉన్నాయి. వీటిలో మూడు లక్షల కేసులు ఉపసంహరించుకోవాలని అస్సాం నిర్ణయించింది. గతేడాది జైళ్ల నిర్వహణ కోసం అస్సాం రూ. 160 కోట్లు వెచ్చించింది. తాజా నిర్ణయంతో పెట్టీ కేసుల్లో శిక్షపడిన వారిపై ఖర్చులు తగ్గనున్నాయి. చిన్నచిన్న తగవులు, కొట్లాటలు, ఉల్లంఘనలపైనా పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేస్తుంటారు. ఇలాంటి కేసులు కోర్టులపై అనవసర భారంగా మారుతున్నాయి. దీనివల్ల అత్యవసర కేసుల విచారణ ఆలస్యమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: