బండి సంజయ్.. మళ్లీ మొదలెట్టాడుగా..?

Chakravarthi Kalyan
ఇవాళ్టి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగ్రామ యాత్ర మళ్లీ మొదలుకాబోతోంది. ఈ సంగ్రామ యాత్ర  4వ విడత ప్రజా సంగ్రామ యాత్రగా నిర్వహించనున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ యాత్ర పెద్ద అంబర్ పేట వరకు పాదయాత్ర సాగుతుంది. ఈ నాలుగో విడత యాత్ర 10 రోజులు.. 115 కిలోమీటర్లు సాగనుంది. గాజులరామారం చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న బండి సంజయ్, పార్టీ శ్రేణులు.. పూజల అనంతరం రాంలీల మైదానంలో పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహించనున్నారు.

ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్  హాజరుకానున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఈ నాలుగో విడత పాదయాత్ర సాగనుంది. ఈ నెల 22న పెద్ద అంబర్ పేట వద్ద బండి సంజయ్ సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: