సీఎం జగన్‌ గారూ.. ఆ రచ్చ తట్టుకోలేం.. ప్లీజ్‌?

Chakravarthi Kalyan
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆల్‌ ఇండియా ష్రింప్‌ హ్యచరీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కలిశారు. కాకినాడ వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మేజర్‌ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ అంశంపై వారు చర్చించారు. ఈ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యసంపద, సముద్ర ఉత్పత్తుల ఉనికికి ప్రమాదం ఏర్పడకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆల్‌ ఇండియా ష్రింప్‌ హ్యచరీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. బల్క్ డ్రగ్‌ పార్క్‌ వ్యర్ధ జలాల డిశ్చార్జ్‌ పాయింట్‌ దూరం పెంచాలని సీఎంని కోరిన హ్యచరీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు సర్‌ప్లస్‌ పవర్‌ను హ్యచరీస్‌కు ప్రత్యేక కేటగిరి క్రింద ఇవ్వాలని ఆల్‌ ఇండియా ష్రింప్‌ హ్యచరీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సీఎం జగన్ ను కోరారు. ష్రింప్‌ హ్యచరీస్‌ అసోసియేషన్‌ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని ఆల్‌ ఇండియా ష్రింప్‌ హ్యచరీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: