విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఛాన్స్ ఈ ఒక్క ఏడాదే?

Chakravarthi Kalyan
ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కోసం ఇంటర్ అర్హత మార్కుల్లో సడలింపులు ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. దీని ప్రకారం ఇంటర్ మొదటి, రెండో ఏడాదిలో కలిపి 45 శాతం లేకున్నా.. రెండో ఏడాదిలోనే 45 శాతం మార్కులు ఉన్నా ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాదికి మాత్రం ఈ అవకాశం కల్పించారు. గ్రూపు సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు ఉన్నా కూడా ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కు అర్హులే .
అంతే కాదు.. రిజర్వుడు అభ్యర్థులకు 40శాతం మార్కులు ఉన్నా ఓకే..  కరోనా కారణంగా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించ లేదు కదా. అందర్నీ పాస్ చేసి , కనీస ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు కదా. మార్కుల మెరుగుకు సప్లిమెంటరీ నిర్వహించినా చాలా మంది పరీక్షలు రాయలేదు. దీంతో చాలా మందికి అర్హత మార్కులు తగ్గాయి. అందుకే ఈ ఒక్క ఏడాదికి మినహాయింపు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: