గంజాయి మానేస్తే.. జగన్ బంపర్ ఆఫర్‌?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా గంజాయి వినియోగం పెరిగిపోతోంది. చివరకు పాఠశాలలు, కాలేజీల్లోనూ గంజాయి విచ్చలవిడిగా వాడుతున్నారు. విశాఖ మన్యం, ఇతర అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు ఎప్పటి నుంచో సాగుతోంది. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. ఈ గంజాయి మాఫియాను అరికట్టడంతో ఇంకా పోలీసులు విఫలం అవుతూనే ఉన్నాయి.
అయితే.. ఏపీ సీఎం జగన్ ఇప్పుడు గంజాయి సాగు  చేసే వారికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. గంజాయి సాగుపై ఆధారపడిన కుటుంబాల ఆర్ధిక పరిస్ధితులు మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని.. తద్వారా వారితో గంజాయి సాగు మానిపించొచ్చని సూచించారు. అంతే కాదు.. గంజాయి సాగును వదలిస్తే ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని సూచించారు. గంజాయి వదిలేసి..  ఇతర పంటలు సాగు చేస్తున్న  గిరిజనులకు ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు ఇవ్వాలని సూచించారు. అంతే కాదు.. అలాంటి వారికి రైతు భరోసా వర్తింపజేయాలని సీఎం జగన్ ఆఫర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: