మైనర్ బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలుశిక్ష?

Chakravarthi Kalyan
కామంతో కన్నూమిన్నూగానక.. ఓ పసిపాపను చెరిచిన దుర్మార్గుడికి ఓ కోర్టు ఏకంగా 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తికి  విజయవాడ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పట్నాల మహేశ్ అనే వ్యక్తి మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేశాడు. పట్నాల మహేష్ పై మాచవరం పోలీసులు పోక్సో యాక్ట్  కింద కేసు నమోదు చేసారు.

తీవ్ర నేరంగా పరిగణించిన పోక్సో కోర్ట్ త్వరితగతిన ట్రయిల్ నిర్వహించే విధంగా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా చొరవ చూపారు. నిందితునికి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం  20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష విధించారు. దీంతో పాటు 10,000 జరిమాన కూడా విధించారు. బాధిత బాలికకు 4 లక్షల నుండి  7 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం వచ్చేవిధంగా చూడాలని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సర్వీస్ అధారిటీని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: