దేవుడా.. బాసర ఐఐటీలో గంజాయి కలకలం?

Chakravarthi Kalyan
బాసర ఐఐఐటీ.. నిన్నటి వరకూ ఇక్కడి విద్యార్థుల పోరాటం ద్వారా ఈ వర్శిటీ వార్తల్లోకి ఎక్కింది. తమ సమస్యలపై వారు చేసిన పోరాటానికి సమాజం నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు అక్కడి ఓ ఇద్దరు విద్యార్థులు చేసిన చెత్త పని కారణంగా బాసర ఐఐఐటీ పరువు పోయే పరిస్థితి వచ్చింది. బాసర ఐఐఐటీలో గంజాయి తాగుతున్నారన్న అనుమానంతో ఇద్దరు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదైంది.
బాసర ఐఐఐటీలో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శుక్రవారం రాత్రి గంజాయి తాగుతున్నారని మిగిలిన విద్యార్థులు చెబుతున్నారు. ఆ విషయం పసిగట్టి వెంటనే వారు బాసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాసర ఐఐఐటీకి వచ్చి తనిఖీలు చేసి.. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు విద్యార్థులపై ఎన్‌డీపీసీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. తర్వాత రిమాండ్‌కు తరలించారు. విద్యాలయంలోకి గంజాయి ఎలా వచ్చింది.. ఇంకా ఎందరు గంజాయి తాగుతున్నారన్న కోణంలో విచారణ సాగుతోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: