అయ్యో.. పాకిస్తాన్‌కు అతి పెద్ద కష్టం?

Chakravarthi Kalyan
మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌కు అతి పెద్ద కష్టం ప్రకృతి రూపంలో వచ్చి పడింది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్  ప్రావిన్స్ లో భారీ వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. జూన్  నుంచి ఇప్పటివరకు అక్కడ వర్షాలతో ఏకంగా 120మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. ఎడతెరిపి లేని వానలతో ఏకంగా 10వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో 6వేల 700 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని పాక్ వర్గాలు తెలిపాయి.
బలూచిస్తాన్ లోని 29 జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. పాక్  సైన్యం వారికి హెలికాప్టర్ల సాయంతో ఆహారాన్ని అందిస్తోంది. వరదల్లో చిక్కుకున్న పలువురిని రక్షించి సైనిక హెలికాప్టర్ లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. వరదలతో ఆరు ప్రధాన వంతెనలు దెబ్బతిన్నాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యాయి.  భారీ వర్షాలతో బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచి ఇరాన్, అప్ఘాన్ లకు వెళ్లే రైళ్ల మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. ఇరాన్ -అఫ్గాన్ -పాకిస్తాన్  మధ్య వాణిజ్య రవాణా కూడా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: