రాజపక్ష: శ్రీలంక రాజకుటుంబానికి ఎన్ని కష్టాలో?

Chakravarthi Kalyan
రాజపక్ష.. శ్రీలంకను దశాబ్దాల పాటు ఏలిన రాజకుటుంబం.. అలాంటి రాజపక్ష  కుటుంబానికి ఇప్పుడు వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఆ దేశాధ్యక్షుడుగా ఉన్న గొటబాయ రాజపక్ష  దేశం విడిచిపారిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆయన కుటుంబీకులైన మాజీ ప్రధాని మహింద రాజపక్ష , ఆయన సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్ష  కూడా దేశం విడిచిపారిపోతారని అంతా ఊహించారు.

అయితే.. అనుకోకుండా ఇప్పుడు వీరిద్దరూ జులై 28 వరకు దేశం విడిచి వెళ్లకూడదని శ్రీలంక సుప్రీంకోర్టు నిషేధం విధించింది. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితిపై ఓ స్వచ్ఛంద సంస్థ ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ  పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు వీరిద్దరిపై ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. రాజపక్ష సోదరులు, సెంట్రల్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి శ్రీలంక విడిచి వెళ్లకుండా చేయాలని ఆ సంస్థ తమ పిటిషన్‌లో కోరింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి వీరే కారకులన్నది ఆ సంస్థ ఆరోపణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: