నిజామాబాద్‌లో ఇన్నిఅరాచకాలు జరుగుతున్నాయా?

Chakravarthi Kalyan
నిజామాబాద్‌లో ఇటీవల ఓ ఉగ్రవాదుల క్యాంపు విషయం వెలుగు చూసింది. ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జగిత్యాలకు చెందిన వ్యక్తి నిజామాబాద్ వేదికగా ఉగ్ర శిక్షణను ఇస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్యాంపులో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ న‌లుమూల‌ల నుండి వ‌చ్చి శిక్షణ తీసుకుంటున్నారని ధర్మపురి అర్వింద్ అంటున్నారు. నిజామాబాద్ లో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతుందని.. నిజామాబాద్ లో శాంతి భద్రతలు క్షీణించాయని..
ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నిజామాబాద్ పోలీసు క‌మిష‌నర్ శాంతిభద్రతల ప‌రిర‌క్షణ‌లో వైఫ‌ల్యం చెందారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నిజామాబాద్ లో ప్రజాప్రతినిదులను హ‌త్య చేసేందుకు సుపారీలు తీసుకుంటున్నారని.. ఎంపీగా ఉన్న నాపైనా హ‌త్యా య‌త్నం జ‌రిగిందని ధర్మపరి అర్వింద్ గుర్తు చేస్తున్నారు. ఈ విషయంపై స్వయంగా నేను ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల స‌హ‌కారంతోనే వంద‌లాది నకిలీ పాస్ పోర్టులతో రోహింగ్యాలు చలామణి అవుతున్నారని ఘాటుగా విమర్శించారు ధర్మపురి అర్వింద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: