గ్యాస్‌ ధరకూ.. ఠాక్రే సర్కారు కూల్చివేతకూ లింకు?

Chakravarthi Kalyan
వంటగ్యాస్ సిలిండర్ ధర పెరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ గ్యాస్ ధర పెరగడానికి మహారాష్ట్రంలో ఇటీల ఠాక్రే సర్కారు కూలిపోవడానికి సంబంధం ఉందా.. అంటే ఉందని వ్యంగ్యంగా చెబుతున్నారు నేషనలిస్ట్  కాంగ్రెస్  పార్టీ శరద్‌ పవార్‌.. మహారాష్ట్రలోని మహావికాస్ ఆఘాఢీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అయిన ఖర్చులను... ఇలా ప్రజల నుంచి రాబట్టుకుంటున్నారా అని శరద్ పవార్ సెటైర్‌ వేశారు. కూటమిలోని 50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు జరిగిన వెంటనే మహారాష్ట్రలో అధికారంలోకి రాగానే సిలిండర్ పై 50 రూపాయల పెంచారని గుర్తు చేశారు.

ఈ రెండింటిలోనూ 50 ఉందని.. ఈ పరిణామాలకు ఏదైనా సంబంధం ఉందంటారా అంటూ సెటైర్‌ వేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అస్సాం వంటి రాష్ట్రాలకు తరలించడం.. ఖరీదైన హోటళ్లలో వసతి కల్పించడానికి భారీగానే ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇంధనధరలను తగ్గిస్తామని కొత్త సీఎం ఏక్ నాథ్ శిందే అసెంబ్లీ వేదికగా చెప్పారు. అయితే.. ఆ మరుసటి రోజే గ్యాస్ ధరలు పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: