వాటీజ్‌ దిస్‌.. డబ్బు మోడీది.. ఫోటో జగన్‌దా..?

Chakravarthi Kalyan
ఆరోగ్యశ్రీ కార్డులపై ప్రధాని నరేంద్రమోదీ ఫోటో లేకపోవడం వివాదాస్పదం అవుతోంది. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ విషయం లేవనెత్తారు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో ఆమె ఈ విషయం ప్రస్తావించారు. అక్కడ ఆరోగ్యమిత్ర కేంద్రం వద్దకు వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఆయుష్మాన్‌భారత్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్‌ నుంచి నిధులు విడుదల చేస్తోందని గుర్తు చేశారు. ఆయుష్మాన్‌భారత్‌ కార్డులున్న వారికి అందిస్తోన్న వైద్య సేవల గురించి ప్రత్యేకంగా వివరాలు నమోదు చేస్తున్నారా లేదా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ కార్డును పరిశీలించి.. ముఖ్యమంత్రి ఫోటో ఉంది.. మరి మోడీ ఫోటో ఏది అని అడిగారు. ఈ పథకానికి నిధులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం అనే విషయం తెలుసా అని ఆమె ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: