పాపం.. ఆ ఐపీఎస్‌పై జగన్‌ కోపం తగ్గలేదా?

Chakravarthi Kalyan
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై ఏపీ సీఎం జగన్ కోపం ఇంకా తగ్గినట్టే లేదు. అందుకే కోర్టులు తీర్పులు చెబుతున్నా ఇంకా అవి అమలులోకి రావడం లేదు. అందుకే సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదంటూ ఏపీ సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. తనను సస్పెండ్ చేస్తూ గతంలో జీవో జారీ చేసిన కాలం నుంచే తన సస్పెన్షన్ రివోక్ చేయాలని ఆ లేఖలో కోరారు.

హైకోర్టు ఉత్తర్వులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నా.. రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మాత్రమే తన సస్పెన్షన్ రివోక్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని.. తన సస్పెన్షన్ను రివోక్ చేస్తూ ఇచ్చిన జీవోను సవరించాలంటూ వివిధ సందర్భాల్లో తాను చేసిన విఙప్తులను ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోలేదని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. అంతే కాదు.. తనకు ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదని ఏబీ వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ABV

సంబంధిత వార్తలు: