ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్‌?

Chakravarthi Kalyan
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతల భాగస్వామ్యంపై నివేదికలు తెప్పించుకున్న సీఎం జగన్ కొందరు ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. ఐ ప్యాక్  సంస్థ ద్వారా చేయించిన రోజు వారి సర్వే నివేదికను సీఎం జగన్ ఎమ్మెల్యేల ముందు ప్రదర్శించి మరీ వివరించారు. గడప గడప కార్యక్రమంలో అత్యధికంగా, అత్యల్పంగా పాల్గొన్న ఎమ్మెల్యేల లిస్టును ఆయన ఎమ్మెల్యేల ముందు పెట్టారు.

వారిలో అతి తక్కువగా క్షేత్ర స్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యేలు, నేతలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అసలు ఒక్క రోజూ తిరగలేదని సీఎం జగన్  తెలిపారు. నెలరోజు కార్యక్రమంలో ఒక్కరోజూ తిరగని వారి లిస్టు జగన్ బయటపెట్టారు. వారిలో కొవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని,  శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వంటి వారు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: