అయ్యయ్యో.. 22వేల బ్యారెళ్ల ఆయిల్‌ ఎడారి పాలు?

Chakravarthi Kalyan
చమురు.. ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తి వనరు.. అందుకే ఆయిల్ నిల్వలు ఉన్న దేశాల జీడీపీలు గణనీయంగా ఉంటే.. ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా దిగుమతులకే ఖర్చువుతోంది. అలాంటి విలువై ఆయిల్  వేల లీటర్ల కొద్దీ ఎడారి ఇసుకలో కలిసిపోయిందట. అవును.. లిబియా దేశంలో వేలాది బారెళ్ల చమురు ఎడారి పాలైంది. సరీర్‌ చమురు క్షేత్రాన్ని మధ్యధరా సముద్రంలో ఉన్న టోబ్రూక్‌ టెర్మినల్‌కు కలిపే భూగర్భ పైపు లైన్‌  దెబ్బతినడం వల్ల ఇలా జరిగింది. దీంతో భారీ ఎత్తున ఆయిల్  మట్టిలో కలిసిపోయింది.

అందుకే సాధారణంగా ఎర్ర రంగులో ఉండే ఎడారి ప్రాంతం చమురు లీకైన చోట్ల నల్లగా మారింది. అసలే ఇప్పటికే చమురు సంక్షోభంతో లిబియాలోని ఆయిల్‌ సంస్థలు అల్లాడుతున్నాయి. ఇప్పుడు  ఈ ఘటనతో తాము తీవ్రంగా నష్టపోతామని వారు లబోదిబోమంటున్నారు. ఈ  పైపు లీకేజీ కారణంగా 22వేల బ్యారెళ్ల చమురు ఎడారిలో కలిసిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: