హవ్వ: లండన్‌లో పరువు తీసుకుంటున్న పాకిస్తాన్ నేతలు?

Chakravarthi Kalyan
పాకిస్తాన్ నాయకుల పరువు ఇప్పుడు లండన్ నడివీధులకు ఎక్కింది. ఇటీవల పాక్‌ నేత ఇమ్రాన్ ఖాన్‌ ను ప్రధాని పదవి నుంచి అవిశ్వాసం ద్వారా తొలగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్‌ షరీఫ్ ప్రధాని అయ్యారు. అయితే మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ లండన్‌లో ఉంటున్నారు. ఆయన్ను దేశ బహిష్కరణ విధించారు. ఆయన పాక్‌లో అడుగు పెట్టేందుకు ఇంకా గడువు ఉంది. అయిత్.. ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ఇటీవల లండన్‌లో నవాజ్ షరీఫ్‌ ఉంటున్న నివాసం ముందు ధర్నాలు చేశారు. దీంతో కడపు మండిన నవాజ్ పార్టీ కార్యకర్తలు అదే నగరం.. అంటే లండన్‌లో ఉంటున్న ఇమ్రాన్ మాజీ భార్య జెమీమా ఇంటి ముందు ధర్నా చేశారు. ఇలా పాక్ నాయకులు ఒకరి ఇళ్ల ముందు మరొకరు ధర్నాలు చేసుకుంటూ లండన్‌లో రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. ఇదేం పాకిస్తాన్ పంచాయతీరా నాయనా అని లండన్ వాసులు ముక్కన వేలేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: