పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు మరో బిగ్ షాక్‌?

Chakravarthi Kalyan
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అవి‌శ్వాస తీర్మానంతో పదవి కోల్పోయి అవమాన భారంతో ఉన్న ఇమ్రాన్‌కు ఇప్పుడు ఇంకో షాక్ తగిలింది. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీలో తిరుగుబాటు తలెత్తింది. పీటీఐ పార్టీలోని కీలక నేత రాజీనామా చేశారు.  పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రధాని సర్దార్‌ అబ్దుల్‌ ఖయ్యుం నియాజి తన పదవికి రిజైన్ చేసేశారు. ఈయన్ను ఇమ్రాన్‌ ఖాన్ గతంలో ఏరి కోరి నియమించుకున్నారు. అలాంటి నియాజి ఇప్పుడు పార్టీలో తలెత్తిన తిరుగుబాటు కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. పీవోకేలో సొంత పార్టీకి చెందిన 25 మంది చట్టసభ సభ్యులు నియాజీపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో ఆయన పదవి నుంచి వైదొలగక తప్పలేదు. పీవోకేలో పార్టీ ప్రాంతీయ అధ్యక్షుడు సర్దార్‌ తన్వీర్‌ ఇలియాస్‌కు ఈ తిరుగుబాటుదారులు మద్దతు ఇస్తున్నారు. అసలే పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ సభ విశ్వాసం కోల్పోయాడు. పదవీచ్యుతుడయ్యాడు. ఇది జరిగిన వారం రోజుల్లోపే ఇప్పుడు నియాజీ కూడా అవిశ్వాసం దెబ్బకు రాజీనామా చేయాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: