ప్రాణం తీసిన ఇన్‌స్టా రీల్స్ మోజు.. ఏం జరిగిందంటే?

Chakravarthi Kalyan
టిక్ టాక్‌ కొన్నాళ్ల వరకూ ఇండియన్ యూత్‌ను ఊపేసింది. ఈ టిక్ టాక్ వీడియోల కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ దరిద్రాన్ని కేంద్రం నిషేధించిందంటే.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మాత్రం ఇంకా ఆ ఒరవడి కొనసాగిస్తోంది. తమిళనాడులో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ మోజు.. ముగ్గురు యువకుల  ప్రాణాలు తీసింది.
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ కోసం ముగ్గురు కుర్రాళ్లు వేగంగా వస్తున్న వస్తున్న రైలు ఎదుట వీడియోలు తీసుకుంటుంటే.. ఆ రైల్ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు..... కోల్పోయారు. చెంగల్ పట్టు సమీపంలోని చెట్టిపున్నియం ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.  అశోక్ కుమార్, ప్రకాశ్, మోహన్ అనే ముగ్గురు కళాశాలలో చదువుకుంటున్నారు. వీరు తరచూ సెల్పీ వీడియోలు తీస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసేవారు. మార్చి 7న కూడా ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్ పై రీల్స్ చేస్తున్నారు. అదే సమయంలో చెన్నై నుంచి చెంగల్ పట్టు వెళ్తున్న రైలు వీరిని ఢీ కొట్టింది. ముగ్గురి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: