ఓటింగ్‌ డే: ఇమ్రాన్‌ ఖాన్ ఇంటికే.. అతడే పాక్‌ కొత్త ప్రధాని?

Chakravarthi Kalyan
ఇవాళ పాకిస్తాన్‌ ప్రధాని ఎవరో తేలిపోయే రోజు.. ఇమ్రాన్ ఖాన్‌ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సిందేనని పాక్ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇవాళ పాక్ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగబోతోంది. అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు పాపం ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఇమ్రాన్ ఖాన్  రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు  ప్రచారం జరుగుతోంది. ఈ ఉదయం పదిన్నర గంటలకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్  ఉంటుంది.

గతంలో చివరిబంతివరకు పోరాటం చేయనున్నట్లు ఇమ్రాన్ ప్రకటించారు. ఓటింగ్ అంటూ జరిగితే ఇమ్రాన్  ఓటమి దాదాపు ఖాయం. అందుకే పరువు కోసం ఇమ్రాన్ ఖాన్ ముందే రాజీనామా చేస్తారని అంటున్నారు. మరోవైపు తదుపరి ప్రభుత్వం ఏర్పాటుపై పాక్‌లోని విపక్షాలు చర్చలు జరుపుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా తర్వాత పీఎంఎల్‌-ఎన్‌ అధ్యక్షుడు షాబాజ్  షరీఫ్ పాక్ ప్రధాని కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: