భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు?

Chakravarthi Kalyan
పాకిస్తాన్ పార్లమెంట్ విశ్వాసం కోల్పోయి ఓటమి అంచున ఉన్న పాక్ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్.. అనూహ్యంగా టీవీ ద్వారా ప్రజల ముందుకు వచ్చారు. ఇమ్రాన్ పై అవిశ్వాసం పెట్టిన వారని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో భారత్ పైన కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నారంటే.. “ స్వతంత్ర విదేశాంగ విధానమే మా లక్ష్యం. మాకు భారత్‌, అమెరికాలోనూ చాలామంది స్నేహితులు ఉన్నారు. నాకు ఎవరిపైనా ప్రత్యేకంగా ఎలాంటి  దురుద్దేశాలు లేవు. కాకపోతే ఆ విషయం ప్రకటిస్తున్నారు. పాక్ ప్రధాని అయ్యాక మన విధానం ఎవరికీ వ్యతిరేకంగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. కశ్మీర్‌ విషయంలో భారత్‌ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినప్పడు మాత్రమే ఈ వివాదం వచ్చిందని తెలుస్తోంది. భారత్‌తో స్నేహానికి తన వంతు ప్రయత్నం చేశానని.. కానీ ప్రధాని పదవికి రాజీనామా మాత్రం చేయను.. నా క్రికెట్‌ రోజుల్లో లాగే ఆఖరి బంతి వరకు పోరాటం చేస్తానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: