రేవంత్ టాక్స్: కేసీఆర్ ప్రాపకం కోసం హరీశ్ తిప్పలా?
అయితే.. ఇటీవల హరీశ్ రావు కూడా తరచూ కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మామ చల్లని చూపుకోసం అల్లుడి ఆరాటం చూస్తే జాలేస్తోందని విమర్శించారు. భవిష్యత్ లో పారా బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ మామ ఆదేశంతో రాసిచ్చిన లేఖ ఇదిగో చూడండి హరీష్ అంటూ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. మా పార్టీ సెంట్రల్ హాల్ లో ఫోటో షూట్ చేయదని.. రైతుల కోసం నిఖార్సైన ఫైట్ చేస్తుందని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.