యోగి కేబినెట్‌లో ఒకే ఒక్క ముస్లిం మంత్రి? ఎవరంటే?

Chakravarthi Kalyan
వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న యూపీ సీఎం యోగి ఆదిథ్యానాథ్‌ నిన్న మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలసిందే. ప్రధాని మోడీ, అమిత్‌ షా వంటి దిగ్గజాలు ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే.. వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలోఒకే ఒక్క ముస్లిం నేతకు అవకాశం లభించింది. సహాయ మంత్రిగా ముస్లిం నేత డానిష్ అజాద్ అన్సారి ప్రమాణం చేశారు. 32 ఏళ్ల డేనిష్ అజాద్ అన్సారీ.. గతంలో లక్నో యూనివర్శిటీలో డిగ్రీ చేశారు. యూనివర్శిటీలో ఉన్నప్పుడే ఏబీవీపీలో చేరి క్రియాశీలకంగా ఉన్నారు.  2018 అక్టోబర్‌లో మొదటి సారి యోగి ప్రభుత్వం ఏర్పడినప్పుడు డేనిష్ అజాద్ అన్సారీని ఉర్దూ భాషా కమిటీ అధ్యక్ష పదవికి నామినేట్ చేశారు. ఈ పదవి మంత్రి హోదా ఉన్నది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు డేనిష్ అజాద్ అన్సారీ బీజేపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: