ఇవాళ రేవంత్ రెడ్డి పాదయాత్ర.. ఎందుకో తెలుసా?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇవాళ పాదయాత్ర చేయనున్నారు. సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, శైలజానాథ్ పాల్గొంటున్నారు. భూ సంబంధ సమస్యలను ఎత్తి చూపుతూ భూదాన్ పోచంపల్లి నుంచి రాజీవ్ పంచాయతీ సంఘటన్ చైర్మన్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారు. మార్చి 14న ప్రారంభం అయిన పాదయాత్ర... 26 రోజుల పాటు తెలంగాణలో జరగనుంది.
ఇప్పటికే మొదలైన ఈ పాదయాత్ర ఇవాళ మేడ్చల్ నియోజక వర్గం నుంచి గజ్వెల్ నియోజక వర్గం కాళ్ళకల్ 7 కిలోమీటర్ల వరకు జరగబోతోంది. ఈ పాదయాత్ర లో ఉదయం నుంచి  టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షులు శైలజా నాథ్ ఇద్దరూ పాల్గొనబోతున్నారు. అప్పట్లో ఆచార్య వినోభా బావే.. పోచంపల్లిలో భూదానోద్యమానికి శ్రీకారం చుట్టారు. వినోబా పిలుపుతో ఎందరో భూ స్వాములు తమ భూములు దానం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: