అంతర్జాతీయ న్యాయస్థానంలో రష్యాకు షాక్‌?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌పై దాడులతో విరుచుకుపడుతున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం బిగ్‌ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌పై దాడులు వెంటనే ఆపాలని రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా బలగాలను వెంటనే వెనక్కి పిలవాలంటూ ఐసీజే తీర్పు చెప్పింది. ఈ తీర్పు పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సంతోషం వ్యక్తం చేశారు. ఐసీజేలో తమ దేశం పూర్తి విజయం సాధించిందనిన జెలెన్‌స్కీ ప్రకటన చేశారు.
రష్యా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉండాలన్న జెలెన్‌ స్కీ సూచించారు. ఐసీజే తీర్పును విస్మరిస్తే రష్యా మరింత ఒంటరవుతుందని జెలెన్‌ స్కీ అభిప్రాయపడ్డారు. అయితే ఐసీజే రష్యా తీర్పును ఖాతరు చేస్తుందని ఏమాత్రం విశ్వసించలేం. ఐక్య రాజ్య సమితి సూచనలే పాటించని రష్యా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును పట్టించుకుంటుందా అన్నది అనుమానమే. ఐసీజే తీర్పును రష్యా విస్మరిస్తే అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో?
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: