ఉక్రెయిన్: ఇండియాకు చేరిన 80మంది తెలుగువారు?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ నుంచి ఇండియాకు తరలింపు కొనసాగుతోంది. ఇవాళ ఉక్రెయిన్ నుంచి 80 మంది తెలుగు విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు, ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకెవచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం ఓ  ప్రతినిధుల బృందాన్ని కూడా విదేశాలకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

తెలుగు వాళ్లను రప్పించేందుకు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన  హంగేరి, పోలాండ్, రోమేనియా, స్లోవాకియాలకు నలుగురు ప్రతినిధులను పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హంగేరికి ఏపీఎన్ఆర్టీ సలహాదారు మేడపాటి వెంకట్ ను పంపనున్నారు. పోలాండ్ కు యూరప్ ప్రత్యేక ప్రతినిధి రవీంద్రారెడ్డిని.. రొమేనియాకు ప్రభుత్వ డిప్యూటీ సలహాదారు చంద్రహాసారెడ్డిని.. స్లోవాకియాకు రత్నాకర్ ను పంపాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: